
మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఈనాడు, అమరావతి: స్త్రీనిధి కింద డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలకు అనుసరిస్తున్న డిజిటల్‌ రీపేమెంట్‌ విధానాన్ని.. బ్యాంకు లింకేజీ రుణాలకూ వర్తింపచేయాలని బ్యాంకర్లను సెర్ప్‌శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు. డిజిటల్‌ రీపేమెంట్‌ విధానంతో నిధుల దుర్వినియోగాన్ని అరికట్టవచ్చన్నారు. సచివాలయంలో బుధవారం నిర్వహించిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలకు రీపేమెంట్‌(తిరిగి చెల్లింపులు) రికార్డ్‌ అద్భుతంగా ఉందని, ఎన్‌పీఏలూ చాలా తక్కువ కాబట్టి.. వారు తీసుకుంటున్న రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాలన్నారు. అన్ని బ్యాంకుల్లోనూ ఒకే తరహా రేట్లను అమలు చేయాలని సూచించారు. మైక్రో క్రెడిట్‌ ప్లాన్‌ సమర్పించాక నిర్దేశిత గడువులోగా రుణం మంజూరు చేయాలన్నారు. రుణం నవీకరణకు(రెన్యువల్‌) సంఘంలోని సభ్యులందరూ బ్యాంకుకు రావాల్సిన అవసరం లేకుండా లీడర్ల సంతకాలతోనే మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





