
వాహనాలను ప్రారంభిస్తున్న డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా, చిత్రంలో పోలీసు ఉన్నతాధికారులు ఈనాడు, అమరావతి: నేర ఘటనా స్థలాల నుంచి శాస్త్రీయ, సాంకేతిక ఆధారాల సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి జిల్లాలో ఫోరెన్సిక్‌ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చామని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా అన్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్‌ మైదానంలో బుధవారం సాయంత్రం 26 ఫోరెన్సిక్‌ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐడీ విభాగాధిపతి రవిశంకర్‌ అయ్యన్నార్, పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ ఆర్‌కే మీనా, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ ఎన్‌.మధుసూదన్‌రెడ్డి, ఏపీ ఫోరెన్సిక్‌ ప్రయోగశాల డైరెక్టర్, ఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ, ఐజీ రవిప్రకాశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





