
యూపీలో ప్లాంట్ల ఏర్పాటుకు యత్నాలు ఈటీవీ భారత్‌: ‘ఓం దివ్యదర్శన్‌ సంస్థాన్‌’ అనే సంస్థ ఆవు పేడతో అత్యాధునిక బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, స్పేస్‌సూట్‌ల తయారీకి సిద్ధమవుతోంది. వీటిని సాధారణంగా కెవ్లార్, సిరామిక్‌ ప్లేట్లతో తయారు చేస్తారు. ఈ సంస్థ పేడ నుంచి ఉత్పత్తి అయ్యే నానో సెల్యులోజ్‌తో వాటిని తయారు చేయనుంది. ఈ రక్షణ కవచాలు చాలా చౌకగా లభిస్తాయని, పర్యావరణానికి అనుకూలమైనవని చెబుతోంది. పేడలోని మూలకాలను ప్రాసెస్‌ చేయడంద్వారా ప్రాణాంతకమైన బుల్లెట్లను ఆపగల, ప్రమాదకరమైన అంతరిక్ష రేడియేషన్‌ నుంచి రక్షణ కల్పించగల ఉత్పత్తులను తయారు చేస్తామని ‘ఓం దివ్యదర్శన్‌’ డైరెక్టరు అరవింద్‌ రాజ్‌పుత్‌ తెలిపారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం తమ సంస్థతో త్వరలో ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంటోందని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 5 నగరాల్లో జర్మన్‌ టెక్నాలజీతో కూడిన నమూనా ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. యూపీ సర్కారు ప్రస్తుతం కిలో పేడను రూ.2 ధరకు కొనుగోలు చేస్తోంది. ఈ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే పేడ ధర మరింత పెరిగే అవకాశముంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





