
ఈటీవీ భారత్‌: అమెరికాలో 2001లో జరిగిన ట్విన్‌ టవర్స్‌ దాడులకు ముందు బిన్‌ లాడెన్‌ టార్గెట్‌ చేసిన దేశాల జాబితాలో భారత్‌ ఉన్నట్లు అమెరికా నిఘా సంస్థ సీఐఏ పత్రాలద్వారా వెల్లడైంది. 9/11 దాడులు జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70కిపైగా ఇంటెలిజెన్స్‌ నివేదికలను ఆ సంస్థ తాజాగా విడుదల చేసింది. దాదాపు 100 పేజీలకుపైగా ఉన్న ఈ పత్రాల్లో 9/11 దాడి జరగడానికి ముందు సీఐఏ సమీకరించిన రహస్య సమాచారం, హెచ్చరికలున్నాయి. ‘బిన్‌ లాడెన్‌ టెర్రరిస్టు నెట్‌వర్క్‌ స్టిల్‌ ఏ థ్రెట్‌’ పేరిట ఉన్న పత్రంలో ఈ సమాచారం తెలిపారు. కాకపోతే భారత్‌లో దేనిని లాడెన్‌ లక్ష్యంగా చేసుకున్నాడు.. ఆపరేషన్‌ ప్లానేంటి.. అనే విషయాలను వెల్లడించలేదు. అందులో 1998 ఆగస్టు 28 నాటి ఒక నివేదిక ప్రకారం.. బిన్‌ లాడెన్‌ భారత్, పాకిస్థాన్, ఈజిప్టు, సౌదీ అరేబియా తదితర దేశాల్లో ఉగ్ర దాడులకు కుట్ర పన్నాడని ఉంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





