
దిల్లీ: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, మలేసియా ప్రధాన మంత్రి అన్వర్‌ ఇబ్రహీం ఆదివారం సమావేశమయ్యారు. అల్పాహార విందు సమయంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీకి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ హాజరయ్యారు. భారత్, మలేసియా సంబంధాలపై వారి మధ్య చర్చ జరిగింది. భారత్‌లో 80శాతం మంది మాంసాహారులేనని, భారతీయ మాంసాహారం చాలా బాగుంటుందని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా శనివారం రాత్రి ప్రభుత్వం ఇచ్చిన విందులో శాకాహారం వడ్డించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాంసాహారంతోపాటు తన సోదరి చేసే ఛోలే భటూరే కూడా చాలా బాగుంటుందని వ్యాఖ్యానించారు. అన్వర్‌ ఇబ్రహీం శనివారం రాత్రి ‘ఎక్స్‌’లో పంచుకున్న వీడియో వైరలవుతోంది. అందులో ఓ వ్యక్తి పియానో వాయిస్తుండగా.. ఆ స్వరాలకు అనుగుణంగా 1965నాటి దేవానంద్‌ చిత్రం ‘తీన్‌ దేవియా’లోని కిశోర్‌ కుమార్‌ పాట పాడుతూ ఆయన కనిపించారు. ‘‘ఖాబ్‌ హో తుమ్‌ యా కొయీ హఖీకత్‌’’ (నీవు స్వప్నమా లేదా నిజమా) అనే పాటను అన్వర్‌ పాడారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





