
చైనీస్‌ ఉపాధ్యాయ దినోత్సవంలో అవార్డు అందుకుంటున్న దేవేందర్‌ హుస్నాబాద్, న్యూస్‌టుడే: చైనాలో ఉత్తమ విదేశీ బోధకుడిగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన డా.పొన్నం దేవేందర్‌ గుర్తింపు పొందారు. చైనాలోని కున్మింగ్‌ పట్టణంలోని యున్నన్‌ మిన్జు విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్న దేవేందర్‌ను 2025-26 సంవత్సరానికి గానూ.. ఉత్తమ విదేశీ బోధకుడిగా ఎంపిక చేసి..ఈ నెల 10న చైనీస్‌ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డును అందజేశారు. భారత కరెన్సీలో రూ.1.2 లక్షల నగదును అందించారు. భారత్‌-చైనా విద్యా పరిశోధన సంబంధాలను బలోపేతం చేసినందుకు ఈ అవార్డు లభించిందని దేవేందర్‌ తెలిపారు. హుస్నాబాద్‌ పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన పొన్నం మల్లయ్య ముదిరాజ్‌-భాగ్యమ్మ దంపతుల కుమారుడు దేవేందర్‌. ప్రస్తుతం ప్రొఫెసర్‌ ఫాన్‌ బావోమిన్‌ పాన్‌ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. 2016-18లో చైనాలో పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధన చేశారు. 2019-23లో ఇండియాలోని సీఎస్‌ఐఆర్‌-సీఐఎంపీ, లఖ్‌నవూ, హైదరాబాద్‌లలోని ఆరగెన్‌ లైఫ్‌ సైన్సెన్స్, ఆనర్స్‌ ల్యాబ్స్‌ సంస్థల్లో టీమ్‌ లీడర్‌గా పనిచేశారు. చైనాలో బోధనారంగలో ఉంటూనే ఇప్పటివరకు 20 పరిశోధన పత్రాలు సమర్పించారు. పురస్కారం అందుకోవడంపై స్థానికులు, బంధుమిత్రులు అభినందించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





