
తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) రెండో రోజు పర్యటించారు. బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన పిలిగ్రిమ్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించారు. శ్రీవారికి నిత్యం జరిగే కైంకర్యాలు, విశేష పూజా కార్యక్రమాలు, శేషాచల క్షేత్ర విశిష్టతలను భక్తులు ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా 3డీ, వర్చువల్‌ రియాలిటీ స్క్రీన్లను ఇక్కడ తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా వర్చువల్‌ రియాలిటీలో తిరుమల విశేషాలను చంద్రబాబు తిలకించారు. ఈ వీడియో చూశారా: శ్రీవారికి వైభవంగా చిన్నశేష వాహన సేవ





