
Tirumala | తిరుమల లో భక్తులకు పర్యావరణహితమైన రవాణా సదుపాయాలను కల్పించేందుకు రిలయన్స్ , బయోటెక్ సంస్థలు అందించిన ఉచిత ఈవీ బస్సు ప్రయాణాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి.
© 2026 nimisham.in

Tirumala | తిరుమల లో భక్తులకు పర్యావరణహితమైన రవాణా సదుపాయాలను కల్పించేందుకు రిలయన్స్ , బయోటెక్ సంస్థలు అందించిన ఉచిత ఈవీ బస్సు ప్రయాణాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి.
అమరావతి : తిరుమల ( Tirumala ) లో భక్తులకు పర్యావరణహితమైన రవాణా సదుపాయాలను కల్పించేందుకు రిలయన్స్ ( Reliance ), బయోటెక్ ( Biotech) సంస్థలు అందించిన ఉచిత ఈవీ బస్సు ప్రయాణాలు ( EV Bus Services ) బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీ బస్సులను ప్రారంభించారు. రిలయన్స్ సంస్థ 25 ఈవీ బస్సులను అందిచగా బయోటెక్ సంస్థ 7 బస్సులను అందజేసింది. అదేవిధంగా రిలయన్స్ సంస్థ ప్రత్యేక ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్ను టీటీడీకి అందజేసింది. గత జూన్ నెలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తిరుమలను దర్శించుకుని ఇచ్చిన హామీ మేరకు టీటీడీ కృషికి మద్దతుగా రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా 25 ఎలక్ట్రిక్ బస్సులను సమకూరుస్తానని హామీ ఇచ్చారు.ఈ హామీ మేరకు వారంరోజుల క్రితం 25 ఎలక్ట్రిక్ బస్సులు కొండపైకి చేరుకున్నాయి. ఈ బస్సులో జియో-బిపి ఎలక్ట్రిక్ మొబిలిటీ , ఈవీ ఛార్జింగ్ లాంటి మౌలిక సదుపాయాలు కల్పించింది.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.







