బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారానికి చేరుకోవడంతో హౌస్‌లో గొడవలు, మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరాయి. మొదటి వారంలో చరణ్, చైత్ర రాయ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్లగా, ఈ రెండో వారం నామినేషన్లలో ఏకంగా 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. రోహిత్, ముకేష్ గౌడ, రాం ప్రసాద్, త్రిగుణ్, దేబ్జానీ, కృష్ణుడు, వర్షిణి, షాలిని, సృష్టి, ఝాన్సీ, సుధీర్ నామినేట్ అవ్వడంతో ఆడియన్స్ ఓటింగ్ అత్యంత ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటివరకు వచ్చిన ఓటింగ్ ట్రెండ్స్ పరిశీలిస్తే, బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఎంట్రీ ఇచ్చి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రోహిత్ నాయుడు దాదాపు 30 శాతం ఓటింగ్‌తో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, అతనికి ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫేమ్ ముకేష్ గౌడ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ముకేష్ సైలెంట్‌గా, కూల్‌గా ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్, సీరియల్ ఫ్యాన్స్ ఓట్లతో 29 శాతం ఓటింగ్‌తో రోహిత్‌కు చేరువగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక జబర్దస్త్ క్రేజ్‌తో అడుగుపెట్టిన రాం ప్రసాద్ 8 శాతం ఓట్లతో మూడో స్థానంలో సేఫ్‌గా ఉన్నాడు.