
అమృతలూరు : మండలంలోని అమృతలూరు, కొల్లూరు గ్రామాల్లో తెదేపా, కూటమి నేతల ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వేమూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విఘ్నేశ్వరుడు.. జ్ఞానానికి, వివేకానికి, విజయానికి ప్రతీక అన్నారు. ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సంప్రదాయమన్నారు. విఘ్నాలను తొలగించి సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంలో ధార్మిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని, వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి నిర్వహించే వినాయక చవితి వేడుకలు మరింత ప్రత్యేకమైనవన్నారు. మన సంస్కృతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి వినాయక చవితి నిలువెత్తు ప్రతీక అన్నారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోయి ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ముందుకు సాగాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





