
ఆదిలాబాద్ సాంస్కృతికం: వినాయక చవితి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ఆవరణలో పుర అధ్యక్షురాలు అనూష ప్రజలకు ఉచిత మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు. అనంతరం భక్తుల సౌలభ్యం కోసం నూతన మున్సిపల్ కార్యాలయం ముందర ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటిలో, మండపాల్లో మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





