
Gabbar Singh Actor Ramesh | టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘గబ్బర్‌సింగ్’ చిత్ర నటుడు రమేశ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. కొద్దికాలం క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న ఆయన, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో క్రమంగా కోలుకుంటున్నారు. ఈ కష్టకాలంలో ఆయనలో మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు కుటుంబ సభ్యులు ఎంతో శ్రమిస్తున్నారు. ఆయనకు ఇష్టమైన పవన్ సినిమాలను చూపిస్తూ ఆయనను ఉత్సాహపరుస్తూ, నిత్యం తోడుగా ఉంటున్నారు. మరోవైపు, రమేశ్ అనారోగ్య వార్త తెలిసిన వెంటనే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, సహ నటులు ఆయన ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. తెలుగు చిత్రసీమలో నటుడిగా ఎంతోమందిని అలరించిన ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ పూర్వవైభవం సంతరించుకోవాలని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన ‘గబ్బర్‌సింగ్’ ఫేమ్ రమేశ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు #gabbarsing #viral #tollywood pic.twitter.com/tsLZVIq6FE — Sai vineeth(Journalist🇮🇳) (@SmRtysai) September 17, 2026

.webp)


