
టాప్ యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా కాలం సైలెంట్ అయిన ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. తన విజయం వెనుక అండగా నిలిచిన భర్త గురించి, అలాగే టాలీవుడ్‌కు తీరని లోటు కలిగించిన దివంగత నటులు వేణుమాధవ్, రాకేష్ మాస్టర్లతో తనకున్న అనుబంధం గురించి ఆమె వివరించారు. దివంగత హాస్యనటుడు వేణుమాధవ్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వేణుమాధవ్ తనను చిన్నతనం నుండి చూశాడని, తన బలహీనతలు, భావోద్వేగాలు ఆయనకు తెలుసని ఉదయభాను అన్నారు.



