
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ది ప్యారడైజ్. క్రైమ్, మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తోన్న ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. జడలు వేసుకుని నాని డిఫరెంట్ లుక్, పాటలు, పోస్టర్స్ ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ది ప్యారడైజ్ తెరకెక్కుతోంది. ఇదే సమయంలో ది ప్యారడైజ్ తొలిరోజు ఎన్ని కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుంది అన్నది ఉత్కంఠగా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..





