
సమంత.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు 15 ఏళ్లకు పైగా సినీరంగాన్ని ఏలుతున్నారు సామ్. తమిళనాడులో పుట్టి టాలీవుడ్ మీదుగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు సమంత. భారతదేశంలో అగ్రశ్రేణి హీరోయిన్‌లలో ఒకరిగా, దేశంతో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా నిలిచారు ఈ ముద్దుగుమ్మ. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురైనా వాటిని తట్టుకుని పడి లేచిన కెరటంలా తిరిగి నిలబడ్డారు సమంత. ఇటీవల గర్భం దాల్చిన ఆమె.. తన జీవితంలోనే అత్యుత్తమ క్షణాలను ఆస్వాదిస్తున్నారు. అయితే సమంత ఒకానొక సందర్భంలో సినిమాలను వదిలేయాలని అనుకున్నారట. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
.webp)



