
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. EPFO latest update: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థలో ఒక ప్రధాన మార్పు చేస్తూ.. కొత్త ఈపీఎఫ్ స్కీమ్ 2026ను అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త స్కీమ్ పాత ఈపీఎస్ స్కీమ్ 1952 స్థానంలోకి వస్తుంది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సోమవారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది వెంటనే అమల్లోకి వచ్చింది. ఈపీఎఫ్ ప్రక్రియను మరింత ఈజీగా మార్చడం, డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయడం, కార్మిక చట్టాల అమలును స్పీడప్ చేయడం దీని లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. కొత్త EPF పథకం 2026 డిజిటల్ ప్రక్రియలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుంది. ఇకపై EPF ఖాతాదారులు తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాను అందించడం తప్పనిసరి. దీనివల్ల నిధుల ఉపసంహరణ, ఇతర సేవలు వేగంగా, పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతాయి. ఇది మోసాలను తగ్గించి, ఉద్యోగులకు సకాలంలో ప్రయోజనాలు అందేలా చూస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పథకంలో ఉద్యోగులకు అత్యంత ఊరటనిచ్చే వార్త ఏమిటంటే.. ఈపీఎఫ్ నుండి పాక్షిక ఉపసంహరణలు గతంలో కంటే సులభతరం అయ్యాయి. ఉద్యోగులు ఇప్పుడు అనారోగ్యం, పిల్లల విద్య, వివాహం, ఇంటి కొనుగోలు లేదా ఇతర ముఖ్యమైన గృహ అవసరాల కోసం ఈపీఎఫ్ నుండి నిధులను విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే, కొన్ని షరతులు వర్తిస్తాయి. ఖాతాలో కనీస నిల్వ తప్పనిసరిగా నిర్వహించాలి. గతంలో ఉపసంహరణ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉన్నందున.. ఈ మార్పు అత్యవసర పరిస్థితులలో ఉద్యోగులకు గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తుందని నిపుణులు అంటున్నారు. 12శాతం వాటా నిబంధన : కొత్త పథకం EPF వాటా






































