చిట్టి వస్తుందని రామచంద్ర చెప్పడంతో దమయంతి షాక్ అవుతుంది. ఏంటి వదిన సంతోష పడకుండా షాక్ అవుతున్నావ్.. చిట్టి రావడం నీకు ఇష్టం లేదా? అని సునంద అడుగుతుంది. నాకు ఎందుకు సంతోషంగా ఉండదు.. బావ గారు
ఎంతో సంతోషంగా ఉన్నారు.. నాకు కూడా అంతే సంతోషంగా ఉంది.. అని దమయంతి అంటుంది. ఇక అందరూ సంతోషంగా ఉండటంతో ఓర్వలేక దమయంతి పక్కకి వెళ్తుంది. మామ్ ఏంటి.. ఏం ఆలోచిస్తుంది అని ప్రియ కూడా పక్కకి వెళ్తుంది. రామచంద్ర మాత్రం తన బర్త్ డేను చిట్టి చెప్పినట్టుగా గ్రాండ్‌గా చేయాలని అంటాడు. కేవలం బర్త్ డే కాదు.. చిట్టికి వెల్కమ్ పార్టీలా గ్రాండ్‌గా చేద్దామని విక్రమ్ అంటాడు.మరో వైపు చిట్టి విషయాన్ని భవానీ శంకర్‌కు చెబుతుంది దమయంతి. అదెలా సాధ్యం.. చిట్టి వస్తుందా? అని భవానీ శంకర్ అంటాడు. నా భర్తను దూరం చేసి నన్ను జీవితాంతం బాధపెడుతున్న రామచంద్రకు అతని ఫ్యామిలీని దూరం చేశా.. వైదేహి చచ్చింది.. ఈ చిట్టి బతికి చచ్చింది.. మళ్లీ ఇన్నాళ్లకు వస్తోంది.. రామచంద్ర సంతోషంగా ఉంటాడు.. అది నాకు నచ్చడం లేదు అన్నయ్య.. నేను అతడ్ని జీవితాంతం శిక్షించాలి అని దమయంతి అంటుంది. సరే అమ్మా అలానే చేద్దాం.. ఆ బర్త్ డే పార్టీలోనే చిట్టిని లేపేద్దాం అని భవానీ శంకర్ అంటాడు.🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్ : మనసులో ఉన్నదంతా కక్కేసిన చక్రి.. ఇంట్లోంచి ఎప్పుడు వెళ్లిపోతాడో కనుక్కోండి.. మహా మాటలకు పెద్ది షాక్మరో వైపు రాధకు ప్రపోజ్ చేస్తున్నట్టుగా విక్రమ్ రోజా పువ్వుని పట్టుకుని డైలాగ్స్ చెబుతాడు. నీకు ఈ విషయాన్ని చెప్పాలని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాను.. నువ్వే నా ప్రాణం ఐ లవ్యూ అని చెబుతాడు విక్రమ్. ఐ లవ్యూ టూ అని ఆ పువ్వుని తీసుకుంటుంది రాధ. ఇలానే రేపు చిట్టికి ప్రపోజ్ చేస్తా.. తను కూడా ఇలానే తీసుకుంటుందా? ఒప్పుకుంటుందా? అని విక్రమ్ అనడంతో రాధ ఒక్కసారిగా బాధపడుతుంది. మనసు ముక్కలైనట్టుగా చూస్తుంది. చిట్టి రాగానే నువ్వు వెళ్లిపోతావ్.. నిజం చెప్పేస్తా.. నిన్ను పంపేస్తా.. చిట్టిని పెళ్లి చేసుకుంటా అని విక్రమ్ అంటే.. రాధ కన్నీరు పెట్టుకుంటుంది.🔹‘గుండెనిండా గుడిగంటలు’ టుడే ఎపిసోడ్: బాలు కాలర్ పట్టుకున్న అరుణ్.. దొంగచాటుగా మింగేసిన ప్రభావతి.. చింటుగాడికి తప్పిన ప్రమాదంనిజం తెలిస్తే నువ్వు షాక్ అవుతావ్.. చిట్టిలా ఫోన్ చేసింది నేనే.. రేపు చిట్టి రాదు అని రాధ నిజం చెబుతుంది. మామయ్యకు అబద్దం చెప్పావా? ఎంత బాధ పడతాడో నీకు తెలుసా? మనుషుల ఎమోషన్స్‌తో ఆడుకుంటావా? అని రాధని కొట్టబోతాడు విక్రమ్. మా నాన్నని పట్టించుకోరా? కనీసం బర్త్ డే కూడా సెలెబ్రేట్ చేయలేదా? అని చిట్టి వచ్చినప్పుడు అడిగితే ఏం చేస్తారు అని రాధ అంటుంది. ఆయన్ను సంతోషంగా చూసుకోవడం మన బాధ్యత కదా అని రాధ అంటుంది. మరి నిజం తెలిస్తే మామయ్య బాధపడతాడు అని విక్రమ్ అంటే.. మంచి మనసుతో మంచి పని చేస్తే.. అంతా మంచే జరుగుతుంది అని రాధ అంటుంది.ఉదయం లేవగానే అందరూ కూడా రామచంద్రకు బర్త్ డే విషెస్ చెప్పాలని చూస్తారు. రాత్రంతా నిద్రపోకుండా రామచంద్ర అలానే మేల్కొని ఉంటాడు. చిట్టి వస్తుందని చెప్పావ్.. రాదు అని తెలిస్తే మామయ్య ఎంతలా బాధపడతాడో చూడు అని రాధ, విక్రమ్ చూపులతోనే మాట్లాడుకుంటారు. ఏం కాదు.. నేను ఉన్నా కదా అని చూపులతో సైగ చేస్తుంది రాధ. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.