
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Vaidhriti Yog On July 22 Latest News: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాల సంచారాలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని మనందరికీ తెలుసు. గ్రహాల మార్పుల వల్ల ఎప్పటికప్పుడు సరికొత్త యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే రాబోయే జూలై 22 (బుధవారం) రోజు ఒక అరుదైన, విశేషమైన ఖగోళ సంఘటన జరగబోతోంది. సూర్యుడు, చంద్రుల కలయిక కారణంగా అత్యంత శక్తివంతమైన వైధృతి యోగం ఏర్పడనుంది. ఈ యోగాని ఎంతో ప్రత్యేమైన ప్రాముఖ్యత ఉంటుంది.
సనాతన ధర్మంలో, జ్యోతిష్య శాస్త్రంలో వైధృతి యోగాన్ని అంతగా శుభప్రదమైనదిగా భావించరు. కానీ, ఆశ్చర్యకరంగా ఈసారి ఏర్పడబోయే వైధృతి యోగం కొన్ని రాశుల వారిపై ఊహించని సానుకూల ప్రభావాన్ని చూపించబోతోంది. జూలై 22 సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ యోగం ప్రభావం ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ ప్రత్యేక సమయంలో సూర్య-చంద్రుల అనుగ్రహంతో 4 రాశుల వారి జాతకాలు పూర్తిగా మారబోతున్నాయి. వారి జీవితాల్లో సుఖసంతోషాలతో పాటు ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సంచారంతో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో? అదృష్టాన్ని పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి (Aries): మేష రాశి వారికి ఈ వైధృతి యోగం అపారమైన శుభ ఫలితాలను అందించబోతోంది.. ఉద్యోగ లేదా వ్యాపార రంగాలలో ఉన్న వారికి ఊహించని శుభవార్తలు వింటారు.. మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. ప్రేమ సంబంధాలలో సానుకూల మార్పులు రావడం ప్రారంభమవుతాయి.. వివాహిత జీవితంలో భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అదృష్టం మీ వైపు ఉండటంతో అనుకున్న పనులు చకచకా సాగిపోతాయి.
సింహ రాశి (Leo): సింహ రాశి వారికి ఈ యోగం పురోభివృద్ధికి నాంది పలకబోతోంది. వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో పాటు వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయంలో లేదా ఉద్యోగ రంగంలో చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఆటంకాలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.. పనుల్లో వేగం పెరుగుతుంది. సమాజంలో, పని చేసే చోట మీ గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి.. అలాగే, తండ్రితో ఉన్న సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృశ్చిక రాశి (Scorpio): వృశ్చిక రాశి వారికి ఈ వైధృతి యోగం కొత్త అవకాశాలను అందించబోతోంది.. సుదీర్ఘకాలంగా మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ సమయంలో మంచి ఉద్యోగ అవకాశం లభించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. తండ్రుల ద్వారా భారీ మొత్తంలో ఆస్తులు కూడా పొందుతారు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా తప్పకుండా కలుగుతుంది.. కార్యాలయంలో కొత్త బాధ్యతలు పెరగడంతో పాటు, అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి.. ఈ కాలంలో కుటుంబ సభ్యుల పూర్తి సహకారం మీకు లభిస్తుంది.
ధనుస్సు రాశి (Sagittarius): సూర్య-చంద్రుల ఈ విశేష కలయిక ధనుస్సు రాశి వారికి అత్యంత లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అదృష్టం మీకు వంద శాతం అండగా ఉండడం వల్ల జీవితంలోని వివిధ రంగాలలో విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది.. మీ సానుకూల ఆలోచనా విధానం జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో సహాయపడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ యోగం ప్రభావంతో సుదూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పాత పెట్టుబడుల నుంచి భారీగా లాభాలు చేకూరే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.