
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. తొలుత పశ్చిమ బెంగాల్లో ఓటమి పాలైన తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల్ని చీల్చి బీజేపీ వైపు తిప్పుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలో శివసేన (యూబీటీ)ని చీల్చి ఆరుగురు ఎంపీల్ని అధికార మహాయుతి కూటమిలో ఉన్న శివసేన శిండే వర్గంలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడో పార్టీ సమాజ్ వాదీ(SP)లోనూ అలాంటి చీలిక తప్పేలా లేదు.మమత కోసం ఎంపీ పదవికి పఠాన్ రాజీనామా ? లాబీయింగ్ పై గంగూలీ క్లారిటీ..!యూపీలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ లోపు విపక్ష సమాజ్ వాదీ పార్టీని బలహీనం చేసేందుకు అక్కడి యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలో ఎస్పీలో చీలిక ఉంటుందని యోగీ కేబినెట్ మంత్రి, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ హింట్ ఇచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) ఒక పెద్ద చీలిక దిశగా పయనిస్తోందని, ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీజేపీలోలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. సువేందుపై కలకత్తా హైకోర్టుకు మమత..! టీఎంసీ సంక్షోభం వేళ..! ఇతర ప్రతిపక్ష పార్టీలలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళాన్ని, ఉత్తర ప్రదేశ్‌లోని రాజకీయ పరిణామాలు త్వరలోనే మరుగున పడేయవచ్చని రాజ్ భర్ తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేనను మరోసారి చీల్చేందుకు అధికార కూటమి ప్రయత్నిస్తున్న తరుణంలో రాజ్ భర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను రాజ్ భర్ ప్రస్తావిస్తూనే, సమాజ్‌వాదీ పార్టీలో కూడా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి ఉత్తరప్రదేశ్ వైపు మళ్లాలని తెలిపారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీకి సంబంధించిన అవినీతి ఆరోపణలను తన వ్యాఖ్యలతో ముడిపెట్టిన ఆయన, ప్రస్తుతం విచారణల ఒత్తిడి కారణంగా పార్టీలో ఆందోళన నెలకొందని అభిప్రాయపడ్డారు












































