తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం కొత్త మలుపు తీసుకుంది. టీఎంసీకి చెందిన 20 మంది రెబల్ ఎంపీలు విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI) నేత యూటర్న్ తీసుకున్నారు. వారిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నట్టు సోమవారం ప్రకటించారు.
బెంగాల్‌కు చెందిన అంతగా గుర్తింపు లేని ఎన్సీపీఐ.. తొలుత త్రిపుర ఎన్నికల్లో పోటీచేసింది. కానీ, టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు తమ వర్గాన్ని ఎన్సీపీఐలో విలీనం చేయబోతున్నట్టు చేసిన ప్రకటనతో ఒక్కసారిగా ఆ పార్టీ దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది.ఎన్సీపీఐ ప్రధాన కార్యదర్శి శంతను దేవ్ మీడియాతో మాట్లాడుతూ..
తనను, ఇతర నాయకులను సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని, వీలీనాన్ని తమ పార్టీలోని మిగతావాళ్లు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అంతేకాదు, పార్టీ అధ్యక్షుడు ఉతియా కుందు తృణమూల్ రెబెల్స్‌ను తమ పార్టీలో చేర్చుకోవడానికి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు.
‘‘పార్టీ అధ్యక్షుడు వారిని చేర్చుకోవాలని చూస్తున్నారు.. కానీ, నేను ఈ చర్యను సమర్థించను’’ అని ఆయన అన్నారు. కానీ, 24 గంటల్లోనే ఆయన మాటమార్చారు. తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీలను ఎన్‌సీపీఐలోకి స్వాగతించాలని సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
‘‘మాది ఒక చిన్న పార్టీ.. పశ్చిమ బెంగాల్ కోసం పనిచేయాలనుకుంటున్నాం... పార్టీ అధ్యక్షుడు కుందు, కోశాధికారి అయిన ఆయన ఆ భార్య షెవ్లీ కుందు ఈ సమావేశానికి హాజరు కాలేదు’’ అని ఆయన అన్నారు.తాను ఎన్సీపీఐ వ్యవస్థాపక సభ్యుడినని దేవ్ చేసిన వాదనలను ఆమె ఖండించారు.
2023 నుంచి ఆయన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా గానీ, సభ్యుడిగా గానీ లేరని ఆమె స్పష్టం చేశారు. అయితే, తృణమూల్ రెబెల్స్ విలీనంపై వ్యాఖ్యానించడానికి ఆమె నిరాకరించారు. ‘‘నేను ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలిని. నేను ఆ పదవికి రాజీనామా చేశాను.
అధ్యక్ష పదవికి రాజీనామా చేశాను’’ అని ఆమె ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన తృణమూల్ సంక్షోభం నేపథ్యంలో ఎన్సీపీఐ వెలుగులోకి వచ్చింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు, 2023లో ఈ పార్టీని ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ (RUPP)గా నమోదు చేశారు. బెంగాల్లో నమోదైనప్పటికీ త్రిపుర ఎన్నికలతో ఆ పార్టీ రాజకీయ అరంగేట్రం చేసింది. అయితే, ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. ఈసీ రికార్డుల ప్రకారం.. దానికి మొత్తం విరాళాలుగా కేవలం రూ. 1.13 లక్షలు మాత్రమే అందాయి.రెబల్స్ ఎన్సీపీఐలో విలీనమైతే ఫిరాయింపులను నివారించడానికి పోరాడుతున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌కు ఇది మరో పెద్ద దెబ్బ అవుతుంది. ఇప్పటివరకు కనీసం 20 మంది తిరుగుబాటు ఎంపీలు తృణమూల్‌పై తమ అసంతృప్తిని వ్యక్తం చేయగా, ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని రెబల్స్‌కు నేతృత్వం వహిస్తోన్న కాకోలి ఘోష్ దస్తిదార్ అన్నారు.
కొత్త అధ్యక్షుడు వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. త్రిపురలో మేము ఎన్డిఎతో ఉన్నాం. కానీ నా వృత్తి కారణంగా ఎక్కువ సమయం కేటాయించలేకపోవడంతో