
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Central Govt Announced 3 Crores New Ration Cards: ఒకవైపు అనర్హులు కూడా రేషన్ కార్డుల ద్వారా ప్రయోజనం పొందుతుండగా, నిజమైన అర్హులు మాత్రం రేషన్ వంటి సౌకర్యాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం అనర్హులపై కఠినంగా వ్యవహరిస్తోంది.
గత కొంతకాలంగానే వారిని జాబితా నుండి తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి కొత్తగా రేషన్ కార్డులు అందజేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వివరించారు. అనర్హుల పేర్లను తొలగించిన తర్వాతే, నిజమైన అర్హుల వారికి ఈ లబ్ధి అందుతుందని ఆయన స్పష్టం చేశారు.
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో పారదర్శకతను పెంచడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. లక్షలాది అనర్హత కలిగిన కార్డులను రద్దు చేసిన అనంతరం, అతి త్వరలోనే ఈ కొత్త కార్డులను జారీ చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా మొత్తం 85.1 మిలియన్ల మంది అనర్హులు రేషన్ కార్డులు కలిగి ఉన్నారని మంత్రి వెల్లడించారు.
ఇందులో చనిపోయిన వారు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, కార్లు ఉన్నవారు కూడా కలిసి ఉన్నారని ఆయన తెలిపారు. ఈ వివరాలతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపామని, త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర అధికారులు 22.1 మిలియన్ల మంది అనర్హ లబ్ధిదారులను తొలగించారని, ప్రస్తుతం వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోందని తెలిసింది.
అయితే, పేర్లను తొలగించే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని, కేంద్రం స్వయంగా ఎవరినీ తొలగించదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా PDS వ్యవస్థలో డిజిటలైజేషన్ పెరగడం వల్ల పారదర్శకత గణనీయంగా మెరుగుపడింది. ప్రస్తుతం
98.5 శాతం రేషన్ పంపిణీ ఆధార్ , ఈ-పోస్ (e-POS) యంత్రాల ద్వారా ధృవీకరణ తర్వాతే జరుగుతోందని చెప్పారు. కేంద్రం అందించే బియ్యం, పప్పులు, ఉప్పు వంటి వస్తువులు కేవలం అర్హులైన వారికి మాత్రమే అందుతున్నాయని, రేషన్ పంపిణీ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా డిజిటలైజ్ అయిందని ఆయన పేర్కొన్నారు.
రేషన్ కార్డు అర్హతలు ఇలా ఉన్నాయి: రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో నెలకు ఆదాయం రూ.10,000 లోపు ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.12,000 మించకూడదు. భూమి యజమానుల విషయంలో 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం ఉండకూడదు. కారు ఉన్నవారు, ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఈ కార్డులు జారీ చేయరు. కొన్ని రాష్ట్రాల్లో సొంత ఇల్లు, ఎయిర్ కండిషన్ వంటి ఆస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. వివిధ ప్రమాణాల ప్రాతిపదికన అనర్హులైన వారిని తొలగిస్తున్నామని, దీని ద్వారా 2026 జూన్ నాటికి సుమారు 2.21 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేశామని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.