
శివసేన (యూబీటీ)లో చీలిక ఏర్పడనుందని, ఏడుగురు ఎంపీలు పార్టీ ఫిరాయించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎంపీలను పార్టీ మారేందుకు ఒక్కొక్కరికి రూ.50 కోట్ల కనీస మద్దతు ధర నిర్ణయించారని, అందులో రూ.15 కోట్లు అడ్వాన్స్ ఇస్తున్నారని రౌత్ ఆరోపించారు.
ముంబై: శివసేన (యూబీటీ)లో చీలిక ఏర్పడనుందని, ఏడుగురు ఎంపీలు పార్టీ ఫిరాయించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎంపీలను పార్టీ మారేందుకు ఒక్కొక్కరికి రూ.50 కోట్ల కనీస మద్దతు ధర నిర్ణయించారని, అందులో రూ.15 కోట్లు అడ్వాన్స్ ఇస్తున్నారని రౌత్ ఆరోపించారు.
దీనికిముందు, పార్టీ మారేందుకు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఆఫర్ చేస్తున్నారనంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా వెంటనే స్పందించారు. 'కేవలం 15 కోట్లేనా? మా ఎంపీలకు రూ.4 కోట్లు అడ్వాన్, తర్వాత 36 నెలల వరకూ నెలకూ రూ.కోటి ఆఫర్ ఇచ్చారు.
హనీ ప్లస్ మనీ' అని పోస్టు చేశారు. దీనికి వెంటనే సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు. 'మహువా జీ.. ఒక్కో ఎంపీకి కనీస మద్దతు ధర రూ.50 కోట్లు ఫిక్స్ చేశారు. రూ.15 కోట్లు అడ్వాన్స్ మాత్రమే. నిజానికి వీళ్లు (ఎంపీలు) రూ.50,000 కూడా విలువచేయరు.
శివసేన, టీఎంసీ బ్రాండ్ లేబుల్ కారణంగానే వాళ్ల ధర పెరిగింది' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 'ఆపరేషన్ టైగర్' పేరుతో యూబీటీ ఎంపీలను పార్టీ మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
శివసేన యూబీటీకి చెందిన తొమ్మిది మంది ఎంపీల్లో ఏడుగురు ఎంపీలు తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలుసుకోనున్నట్టు చెబుతున్నారు. పార్లమెంటు సమావేశాలకు ముందే ఈ ఏడుగురు యూబీటీ ఎంపీలు ఏక్నాథ్ షిండే
సారథ్యంలోని శివసేనలో చేరే అవకాశం ఉంది.
ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్? ఢిల్లీలో స్పీకర్ను కలవనున్న ఆరుగురు ‘UBT’ ఎంపీలు!