
మంగళగిరి నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తీవ్రమైన మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటీఎంసీ) పరిధిలో సుమారు రూ.1,167 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) వ్యవస్థ పనులకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.
తాడేపల్లిలోని ప్రాతూరు రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను లాంఛనంగా ప్రారంభించారు.ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రి నారా లోకేశ్ తన హామీ నెరవేర్చడంపై దృష్టి సారించారు. తొలి ప్రాధాన్యతగా భూగర్భ డ్రైనేజీకి సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధం చేయించి, నిధుల మంజూరుతో పాటు పరిపాలన అనుమతులు కూడా వేగంగా తీసుకువచ్చారు.
ఈ ప్రాజెక్టుతో మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేశ్ పునరుద్ఘాటించారు. అంతకుముందు కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులకు టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. దశాబ్దాల నాటి తమ చిరకాల వాంఛ నెరవేరుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.రెండు దశల్లో బృహత్తర నిర్మాణంఈ యూజీడీ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో రెండు దశలుగా చేపట్టనున్నారు.
మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.1,167.50 కోట్లు కాగా, మొదటి దశ పనులకు రూ.604.32 కోట్లు, రెండో దశకు రూ.563.18 కోట్లు కేటాయించారు. రాజధాని గ్రామాలైన బేతపూడి, నవులూరు, యర్రబాలెం, నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి మినహా మిగిలిన ఎంటీఎంసీ ప్రాంతమంతా