హైదరాబాద్ మెట్రో ఫేజ్
Actor ProfileActor

హైదరాబాద్ మెట్రో ఫేజ్

📊 Box Office Collections
Total News7
Movie Updates0
Sources7
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు బ్రేక్
Sakshi7 Jul 2026
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు బ్రేక్

సాక్షి,హైదరాబాద్‌: మెట్రో రైలు విస్తరణ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. మెట్రో రైల్ విస్తరణపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విధానానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. ఈ తాజా ఒప్పందం ప్రకారం.. ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం చేసే బాధ్యతను ఎస్‌బీఐ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయించాయి. అయితే, ఈ కొత్త పరిణామంతో గతంలో చర్చల్లో ఉన్న ఐఎఫ్‌ఆర్‌సీ రుణం సీన్‌ నుంచి పూర్తిగా మాయమవ్వడం గమనార్హం. కేంద్ర ప్రతిపాదనల ప్రకారం మెట్రో ఫేజ్-1కు సంబంధించి మళ్లీ కొత్తగా విలువ నిర్ధారణ (వాల్యుయేషన్) ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ వాల్యుయేషన్ పూర్తయిన తర్వాతే, ప్రాజెక్ట్ స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, తగిన ఆర్థిక సంస్థ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాతే మెట్రో ఫేజ్-2 విస్తరణ, దానికి అయ్యే నిర్మాణ వ్యయం,నిధుల సేకరణ అంశాలపై క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహిస్తారు. ఈ ఎస్‌బీఐ కన్సల్టెన్సీ అధ్యయన ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రం నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారిని నియమించనున్నారు. వీరిద్దరూ సమన్వయం చేసుకుంటూ కన్సల్టెన్సీకి అవసరమైన వివరాలను అందిస్తారు. ఈ సంస్థ ఇచ్చే తుది నివేదిక ఆధారంగానే హైదరాబాద్ మెట్రో విస్తరణపై భవిష్యత్తు కార్యచరణను ఖరారు చేయనున్నారు. కేంద్రం తెచ్చిన ఈ కొత్త విధానం వల్ల మెట్రో విస్తరణ ప్రక్రియ మళ్లీ మొదటికి రావడమే కాకుండా, పనుల్లో మరింత ఆలస్యం జరిగేలా కనిపిస్తోంది. ఈ ఎస్‌బీఐ కన్సల్టెన్సీ తన అధ్యయనాన్ని పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందనే గడువుపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టత లేదు. దీంతో మెట్రో ఫేజ్-2 విస్తరణ పనులు ఎప్పుడు పట్టాలెక్కుతాయనే దానిపై సందిగ్ధత నెలకొంది. లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు) నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు) హైదరాబాద్‌ : అర్ధనారీశ్వరం..అద్భుతం (ఫొటోలు) వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు) నందు

ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ.. కిషన్ రెడ్డితో కలిసి కేంద్రమంత్రి ఖట్టర్ తో సమావేశం
Andhra Jyothy5 Jul 2026
ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ.. కిషన్ రెడ్డితో కలిసి కేంద్రమంత్రి ఖట్టర్ తో సమావేశం

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. న్యూఢిల్లీ, జూన్ 23: దేశ రాజధాని

హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2కు లైన్ క్లియర్ అవుతోందా..! ఆ గంటన్నరపాటు ఏం జరిగింది
TV9 Telugu4 Jul 2026
హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2కు లైన్ క్లియర్ అవుతోందా..! ఆ గంటన్నరపాటు ఏం జరిగింది

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-2 సమస్య పరిష్కారం కాబోతోందా?. IRFC రుణం చిక్కులు వీడబోతున్నాయా?. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఇదే నిజమని తెలుస్తోంది. సీఎం రేవంత్ వరుసభేటీలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొనడం చూస్తే.. మెట్రోపై ముందడుగు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-2 పర్మిషన్‌కు ఢిల్లీలో సానుకూల వాతావరణం కనిపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే తొలిదశ మెట్రో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు మధ్యలో ఆగిన IRFC రుణం క్లియర్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర రైల్వేమంత్రితో అపాయింట్ మెంట్ ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి.. కిషన్ రెడ్డికి లేఖ రాయడం, అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేయడం, స్వయంగా కిషన్ రెడ్డి కూడా పాల్గొనడంతో.. నిన్న మొన్నటి వరకు ఉప్పు, నిప్పులా ఉన్న నాయకులు రాష్ట్ర ప్రాజెక్టుల సాధనకు కలిసి ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవంలో భాగంగా.. గాంధీ సరోవర్‌కు అనుమతులు రావడంతో కేంద్ర రక్షణమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత కిషన్ రెడ్డితో కలిసి వెళ్లి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. దాదాపు గంటన్నరపాటు ఈ భేటీ జరిగింది. తెలంగాణకు సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులతో పాటు ప్రధానంగా ఐఆర్‌ఎఫ్‌సీ లోన్‌ అంశంపై ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. IRFC నుంచి రావాల్సిన 13వేల 600 కోట్ల విడుదలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ తరువాత బయటకు వచ్చిన రేవంత్‌రెడ్డి .. చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయన్నారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో ఉన్నామన్నారు సీఎం రేవంత్. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరో కీలక భేటీలో పాల్గొననున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో హైదరాబాద్ మెట్రో రైల్

రైల్వే మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశం
TeluguOne3 Jul 2026
రైల్వే మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశం

రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా దిల్లీ వేదికగా కీలక అడుగులు పడ్డాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన మెట్రో రైలు ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ.. రైల్వే మంత్రితో భేటీ ఏర్పాటు చేయండి
Zee Telugu16 Jun 2026
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ.. రైల్వే మంత్రితో భేటీ ఏర్పాటు చేయండి

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

మొదటి రోజు పాఠశాలల్లో తగ్గిన హాజరు
Vaartha15 Jun 2026
మొదటి రోజు పాఠశాలల్లో తగ్గిన హాజరు

Telangana schools:తెలంగాణ పాఠశాలల్లో అమావాస్య ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. వేసవి సెలవుల తర్వాత సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బడులు తెరిచినప్పటికీ, మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగా

కేసీఆర్ తిట్టినట్లు నేను తిట్టలేదు.. రూ. 13,600 కోట్లు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారు
Samayam Telugu15 Jun 2026
కేసీఆర్ తిట్టినట్లు నేను తిట్టలేదు.. రూ. 13,600 కోట్లు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారు

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు ఆలస్యంపై.. కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం ఎల్ అండ్ టీ నుంచి ఫస్ట్ ఫేజ్ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం

హ దర బ ద మ ట ర ఫ జ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in