
మూడు రోజుల పాటు ఇంట్లో గణపతిని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన మూడేళ్ల బాలుడు ఆర్యన్.. నిమజ్జనం తర్వాత తన గణపతి కనిపించకపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. “నా గణపతి కావాలి” అంటూ చిన్నారి ఏడ్చిన వీడియో ప్రస్తుతం అందరినీ కదిలిస్తోంది. ..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు రోజుల పాటు ఇంట్లో గణపతిని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన మూడేళ్ల బాలుడు.. నిమజ్జనం తర్వాత తన గణపతి కనిపించకపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. వినాయక చవితి అంటే పూజలు, నైవేద్యాలు, భక్తి మాత్రమే కాదు.. చిన్నారులకు గణపతితో ఓ ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంటుంది. అలాంటి అనుబంధమే ఎమ్మిగనూరుకు చెందిన మూడేళ్ల బాలుడు ఆర్యన్ విషయంలో కనిపించింది.




