
తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి సుగంధ ద్రవ్యాలతో రూపొందించిన విశేష మాలల మధ్య బుధవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు అర్చకస్వాములు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి, రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, పసుపు, గంధంతో విశేష అభిషేకం చేశారు. శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో శాస్త్రోక్తంగా స్నపనం నిర్వహించారు. సుగంధ పరిమళాలు, వేదఘోషలు, భక్తి భావంతో రంగనాయకుల మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో తితిదే ఈవో ముద్దాడ రవిచంద్ర, బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా, ఇతర అధికారులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




