
పీలేరు : పీలేరులోని అయ్యప్పనాయిని చెరువు వద్ద జరిగే వినాయక నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని డీఎస్పీ కృష్ణమోహన్‌, సీఐ వెంకటేశ్వర్లుకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలన్నారు. భక్తులందరూ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా, భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనాలను నిర్వహించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




