
విశాఖపట్నం: నగరంలోని సెంట్రల్ పార్క్ వద్ద కరెన్సీ నోట్లు కుప్పగా పడి ఉండటం కలకలం రేపింది. పార్క్ ఎదురుగా పెద్ద మొత్తంలో చినిగిపోయిన కరెన్సీ నోట్లు కుప్పగా పడి ఉండటాన్ని వాకర్స్ గుర్తించారు. ₹500, ₹100, ₹50, ₹20, ₹10 నోట్లతో పాటు కొన్ని పత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే చోట ఇంత మొత్తంలో చినిగిన నోట్లు ఎవరు పడేశారు? అన్నది ఆసక్తికరంగా మారింది. వాకర్స్ సమాచారం ఇవ్వడంతో.. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కరెన్సీ నోట్లను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





