
భక్తులతో కిటకిటలాడిన మాడవీధులు పలు ప్రారంభోత్సవాలు చేసిన సీఎం చిన్నశేష వాహనంపై గోవిందుడు ఈనాడు డిజిటల్, తిరుపతి; - న్యూస్‌టుడే, తిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తకోటి గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం మలయప్పస్వామి వారు రెండు విభిన్న అవతారాల్లో భక్తులకు కనువిందు చేశారు. ఉదయం చిన్నశేష వాహనంపై పాండురంగనాథునిగా, రాత్రి హంస వాహనంపై వీణాపాణిగా మాడ వీధుల్లో విహరిస్తూ భక్తజన కోటిని పునీతులను చేశారు. బ్రహ్మదేవుని వాహనమైన హంస.. జ్ఞానానికి, విచక్షణకు ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే స్వభావం హంసకు ఉంటుంది. అదే విధంగా, భక్తుల్లోని అహంభావాన్ని తొలగించి, మంచిచెడుల విచక్షణను, జ్ఞానసిద్ధిని, బ్రహ్మపద ప్రాప్తిని ప్రసాదించేందుకే స్వామివారు జ్ఞానమూర్తిగా హంస వాహనంపై ఊరేగుతారని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఎస్వీ మ్యూజియం ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి రామనారాయణరెడ్డి, ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, సభ్యులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు వాహన సేవల సమయంలో తితిదే ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒకపక్క వాహన సేవలు జరుగుతుండగానే, మరోపక్క ఆలయంలో శ్రీవారి మూలవిరాట్టు దర్శనం నిరాటంకంగా సాగింది. అదివో అల్లదివో శ్రీహరి చిద్విలాసం బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల ద్వారా తిరువీధుల్లో ఊరేగి అలసిపోయే స్వామి, అమ్మవార్లను సేదదీర్చేందుకు ఆలయ అర్చకులు మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి సుగంధ పరిమళ ద్రవ్యాలు, బహుళ వర్ణాల పూలతో తయారు చేసిన మాలలు, కిరీటాలతో అలంకరించారు. ఉదయం 8:00 - 10:00 గంటల వరకు: సింహ వాహన సేవ. రాత్రి 7:00 - 9:00 గంటల వరకు: ముత్యపు పందిరి వాహన సేవ. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




