
ఇంటర్నెట్‌ డిస్క్‌: వెస్టిండీస్‌తో త్వరలో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ (India vs Westindies)లకు భారత జట్టు ( Team India )ను ప్రకటించారు.వన్డే టీమ్‌లో హార్దిక్‌ పాండ్యకు చోటు దక్కలేదు. సెప్టెంబరు 27 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అక్టోబర్ 6 నుంచి ఐదు టీ20ల సిరీస్‌ ఉంటుంది. వన్డే టీమ్‌: శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రుతురాజ్‌ గైక్వాడ్‌, కేఎల్‌ రాహుల్‌, ధ్రువ్‌ జురెల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, గుర్నూర్‌ బ్రార్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఆకిబ్‌ నబీ, యశస్వి జైస్వాల్‌, నమన్‌ ధిర్‌. టీ20 టీమ్‌: శ్రేయస్‌ అయ్యర్‌, అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, ఇషాన్‌ కిషన్‌, సంజు శాంసన్‌, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్‌ యాదవ్‌. వరుణ్‌ చక్రవర్తి గాయం కారణంగా జపాన్‌తో టీ20, ఆసియా క్రీడల ( Asian Games )కు దూరమయ్యాడు. అతడి స్థానంలో విప్రాజ్‌ నిగమ్‌ను తీసుకున్నారు. మరోవైపు ఆసియా క్రీడల నుంచి నితీశ్‌ కుమార్‌ రెడ్డిని తప్పించారు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అతడికి చోటు కల్పించడమే కారణం. హార్దిక్‌ ఆ జట్టులో లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకునర్నారు. అప్‌డేటెడ్‌ టీమ్‌: శ్రేయస్‌ అయ్యర్‌, అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, శివమ్‌ దూబె, తిలక్‌ వర్మ, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, వైభవ్‌ సూర్యవంశీ, యశ్‌ ఠాకూర్‌, విప్రాజ్‌ నిగమ్‌ .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. సంజు శాంసన్‌ (57; 22 బంతుల్లో 7x4, 4x6) రెచ్చిపోవడంతో అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.




