

- సెప్టెంబర్ 21న భారత మార్కెట్లో లావా విరాట్ కర్వ్ 5జీ లాంచ్
- ఈ ఫోన్లో 120Hz కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే, బ్యాక్ సైడ్ మినీ డిస్ప్లే
- 6000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్, 50MP కెమెరాతో వస్తుంది
Lava Virat Curve : లావా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ రాబోతుంది. లావా విరాట్ కర్వ్ 5Gని సెప్టెంబర్ 21న భారత మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. కంపెనీ ప్రకారం.. ఈ ఫోన్ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అయి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి రానుంది.
ఈ ఫోన్ అతిపెద్ద ఫీచర్ 6.67 అంగుళాల FHD+ 120Hz 3డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. అంతేకాదు.. బ్యాక్ కెమెరా మాడ్యూల్ కింద చిన్న సెకండరీ డిస్ప్లే కూడా ఉంది. నోటిఫికేషన్లు, ఇతర సమాచారాన్ని చూడవచ్చు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్, 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉంటాయి.
ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయం :
లావా విరాట్ కర్వ్ 5జీ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనున్నారు. కంపెనీ మైక్రోసైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ హెరిటేజ్ ఇండిగో, మక్రానా ఐవరీ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
లావా విరాట్ కర్వ్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్ అందిస్తుంది. 6.67-అంగుళాల FHD+ 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లేలో ఫోన్ బ్యాక్ సైడ్ చిన్న సెకండరీ స్క్రీన్ కూడా ఉంది. ఈ మినీ-డిస్ప్లేను నోటిఫికేషన్లు, టైమ్, ఇతర ఇండికేషన్లన డిస్ ప్లే కోసం వాడొచ్చు.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే..
ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌ను అమర్చారు. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీ ఉంది. లావా 2 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్లు, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తామని హామీ ఇచ్చింది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. లావా విరాట్ కర్వ్‌లో f/1.8 అపర్చర్, 10x వరకు డిజిటల్ జూమ్‌తో 50MP సోనీ IMX752 ప్రైమరీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ఏఐ కాల్ సమ్మరీ, ఏఐ కెమెరా, సర్కిల్ టు సెర్చ్ వంటి ఏఐ ఫీచర్లను కూడా అందిస్తుంది. అదనంగా, ఈ ఫోన్‌కు IP64 రేటింగ్, MIL-STD-810H సర్టిఫికేషన్ ఉన్నాయి.





