
ఉండవల్లి: విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మంత్రి నారా లోకేశ్‌ కూడా విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విశ్వకర్మ భగవానుడిని భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు. సమాజ నిర్మాణంలో ఎంతో కీలకమైన శిల్పులు, వృత్తి నిపుణులు, కార్మికులకు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. నైపుణ్యం, సృజనాత్మకత, కష్టపడి పనిచేసే తత్వానికి విశ్వకర్మ భగవానుడు ప్రతీకగా నిలుస్తారని మంత్రి పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




