
ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌ 2027 ఎడిషన్‌కు (ODI world cup 2027) కేవలం ఏడాది వ్యవధి మాత్రమే ఉంది. ఇప్పటికీ స్క్వాడ్‌పై మేనేజ్‌మెంట్ ఓ స్పష్టతకు రావడంలేదు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఆడతారా? లేదా? అనేది తెలియదు. ఈ క్రమంలో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మేనేజ్‌మెంట్‌కు ఓ కీలక సూచన ఇచ్చారు. ఆఖరి క్షణాల్లో స్క్వాడ్‌లో మార్పులు చేయొద్దని హెచ్చరించాడు. ‘‘రాబోయే ఏడాది మొత్తం ఒకే జట్టుతో మ్యాచులు ఆడించాలి. ఆ టీమ్‌తోనే వరల్డ్ కప్‌ బరిలోకి దిగాలి. అంతేకానీ, మరికొద్ది రోజుల్లో మెగా టోర్నీ ఉందనగా మార్పులు చేయొద్దు. మీరు ఎంత మందినైతే ఎంపిక చేస్తారో అది 16 లేదా 20 అయినా సరే వారందరికీ ఈ సంవత్సరం వ్యవధిలో అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు ఎక్కువగా టీ20 క్రికెట్ ఆడుతున్న వేళ.. ప్రతి ఆటగాడికి 50 ఓవర్ల గేమ్‌ అలవాటు తగ్గిపోతోంది. మళ్లీ వారిని రిథమ్‌లోకి తేవాలంటే అవకాశాలు ఇవ్వడమే మార్గం. వరల్డ్ కప్‌ కోసం సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం కేటాయించాలి. మనం పంపించే జట్టు వరల్డ్ కప్‌ను గెలవగలదని నమ్మకం ఉంచుదాం. ఆటగాళ్లకు అండగా నిలుద్దాం. ఓడినా.. గెలిచినా మద్దతు ఇస్తూనే ఉందాం’’ అని యువీ ( Yuvraj Singh ) సూచించాడు. పాక్ బ్యాటర్‌ను వెనక్కి నెట్టి.. మళ్లీ రెండో స్థానంలోకి అభిషేక్ ‘‘ప్రతి జట్టూ భిన్నమైన ప్లేయర్లతో కూర్పుతో బరిలోకి దిగుతుంది. కొన్ని జట్లలో ఎక్కువ మంది ఆల్‌రౌండర్లు ఉంటారు. మరికొన్నింట్లో స్పెషలిస్ట్ బ్యాటర్లు, బౌలర్లకు అవకాశం. ఏదైనా సరే అత్యుత్తమ కాంబినేషన్‌తోనే వెళ్లాలి. ఇక రిజర్వ్ బెంచ్‌పైనా బలం ఉండాలి. మ్యాచ్ గెలిపించగలరని మీకు అనిపించే అత్యుత్తమ 11 మంది ఆటగాళ్లతోనే మీరు బరిలోకి దిగాలి. వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup) ఆస్ట్రేలియా జట్టు ఎందుకు విజయవంతమైన జట్టుగా మారిందంటే.. ఇదే కారణం. ఆ టీమ్‌లో అంతా మ్యాచ్‌ విన్నర్లే. ఇబ్బందుల్లో ఉంటే అందరూ తలో చేయివేసి నడిపిస్తారు. కనీసం ఒక్కరైనా బాధ్యత తీసుకొని చివరి వరకూ ఉండేందుకు ప్రయత్నిస్తారు’’ అని యువీ విశ్లేషించాడు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. సంజు శాంసన్‌ (57; 22 బంతుల్లో 7x4, 4x6) రెచ్చిపోవడంతో అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.




