
© 2026 nimisham.in

సేవా దివస్‌గా జరుపుకోనున్న భాజపా వారణాసిలో బైక్‌ ర్యాలీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పురీ తీరంలో సుదర్శన్‌ పట్నాయక్‌ రూపొందించిన సైకత శిల్పం దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు, ప్రజా సేవలో ఆయన పాతికేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని భాజపా దేశవ్యాప్తంగా గురువారం స్వచ్ఛత, రక్తదానం, ర్యాలీల వంటి కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించనుంది. ఆయన జన్మదినాన్ని ‘సేవా దివస్‌’గా జరుపుకోనుంది. మోదీ జన్మస్థలమైన గుజరాత్‌లోని వడ్‌నగర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ‘సేవా సంకల్ప్‌’ బైక్‌ ర్యాలీని ప్రారంభిస్తారు. ఈ ర్యాలీ ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసి వరకూ సాగుతుంది. వారణాసి నుంచి కూడా వడ్‌నగర్‌కు గురువారం బైక్‌ ర్యాలీ మొదలవుతుంది. దీన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభిస్తారు. వారణాసిలో జరిగే కార్యక్రమంలో రాజ్‌నాథ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితర కీలక నేతలు పాల్గొంటారు. అంతకంటే ముందు చంద్రబాబు కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంటారు. మోదీ పుట్టినరోజున (సెప్టెంబరు 17) ప్రారంభమయ్యే సేవా సంకల్ప్‌ ర్యాలీ.. గుజరాత్‌ సీఎంగా ఆయన తొలిసారి బాధ్యతలు చేపట్టిన అక్టోబరు 7వ తేదీన ముగుస్తుంది. ర్యాలీలో దాదాపు వెయ్యి మంది పాల్గొంటారు. 10 రాష్ట్రాల్లోని 193 జిల్లాల్లో 1,159 గ్రామాల మీదుగా యాత్ర సాగుతుంది. ర్యాలీ సాగే ప్రాంతాల్లో స్వచ్ఛత, మొక్కలు నాటడం, జల సంరక్షణ వంటి కార్యక్రమాలు చేపడతారు. డ్రగ్స్‌ వాడకానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. మోదీ సేవలకు కృతజ్ఞతగా ప్రజలంతా ఇళ్లలో గురువారం సాయంత్రం దీపాలు వెలిగించాలని భాజపా పిలుపునిచ్చింది. ప్రధాని మోదీ ఆర్థిక దార్శనికతను ‘మోదీనమిక్స్‌’గా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభివర్ణించారు. ‘మోదీనమిక్స్‌’ వేసిన పునాది వల్లే దేశ ఆర్థిక రంగం వేగంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.






