
కొల్లాపూర్ పట్టణం: కొల్లాపూర్ మండలంలోని సింగోటం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన కృష్ణయ్య(37) చేపల వేటకు వెళ్లి చెరువులో పడి మృతి చెందాడు. అయితే కృష్ణయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన ఆచూకీ కోసం వెతికారు. బుధవారం చెరువులో మృతదేహం కనిపించడతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి, పంచనామా నిర్వహించారు. మృతుడి భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆనంద్ తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





