
చి త్రాలయం స్టూడియోస్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం... ‘బా బా బ్లాక్‌షీప్‌’. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్‌ మరియన్, అక్షయ్, విష్ణు, కార్తికేయ, విస్మయ శ్రీ, మాల్వీ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. వేణు దోనేపూడి నిర్మాత. ఈ చిత్రం అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వెవెలా ఊహలే చూపినా...’ అంటూ సాగే ఈ చిత్రంలోని పాటని ఇటీవలే ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. కిట్టు విస్సాప్రగడ రచించిన ఈ పాటకి ఎలక్ట్రానిక్‌ కిలి, ఆర్కాడో సంగీత సారథ్యం వహించారు. శ్రీసాగర్‌ ఆలపించారు. ‘‘మేఘాలయాలో పూర్తిగా చిత్రీకరణ చేసుకున్న తొలి దక్షిణాది చిత్రమిది. అద్భుత ప్రదేశమైన చిరపుంజిలో పక్కా ప్రణాళికతో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించాం. ఆ నేపథ్యంతోపాటు, కొత్తతరం క్రైమ్‌ కామెడీతో కూడిన కథ, కథనాలే ఈ సినిమా ప్రత్యేకం’’అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అజయ్‌ అబ్రహాం జార్జ్‌. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





