
ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కింగ్‌’ (King) ఒకటి. బాలీవుడ్‌ స్టార్‌హీరో షారుక్‌ ఖాన్‌ ( shah rukh khan ) కీలక పాత్రలో నటిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ డిసెంబరు 24న (king movie release date) ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ మారొచ్చు అంటూ గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు ట్రెండ్ అయ్యాయి. తాజాగా అభిమానులతో ముచ్చటించిన షారుక్‌ వాటన్నింటికీ చెక్‌ పెట్టారు. ‘ఆస్క్‌ మి ఎనీథింగ్‌’ సెషన్‌లో ‘మీ కుమారుడు అబ్‌రామ్‌ డూమ్స్‌ డే ఫస్ట్‌ చూస్తాడా? ‘కింగ్‌’ చూస్తాడా?’ అని అడగ్గా, ‘తండ్రి నటించిన సినిమానే మొదట చూస్తాడు’ అని సమాధానమిచ్చారు. దీంతో విడుదల తేదీలో ఎలాంటి మార్పూ ఉండబోదని షారుక్‌ చెప్పకనే చెప్పారు. సినిమాలో దేనికోసం మీరు ఎక్కువ కష్టపడ్డారు? అని అడగ్గా ‘షూటింగ్‌ సమయంలో అనేకసార్లు గాయాలు అయ్యాయి. దీంతో విరామం ఇచ్చి మళ్లీ షూట్‌ చేశాం. ఇప్పుడన్నీ సర్దుకున్నాయి. అంతా బాగుంది’ అని అన్నారు. దర్శకుడు సిద్ధార్థ్‌ (Siddharth Anand) చాలా కష్టపడుతున్నారని, మరో టీజర్‌ తీసుకురావడానికి కాస్త ఆలస్యమవుతుందన్నారు. ‘కింగ్‌’లో షారుక్‌ కుమార్తె సుహానా కూడా నటిస్తోంది. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తీర్చిదిద్దుతున్నారు. షారుక్‌ఖాన్‌ ‘కింగ్‌’ మూవీకి పోటీ రెండు హాలీవుడ్‌ చిత్రాలు వస్తున్నాయి. మార్వెల్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘అవెంజర్స్‌: డూమ్స్‌ డే’ (Avengers Doomsday) ఒకటి. డిసెంబరు 18న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక సంచలన చిత్రం ‘డ్యూన్‌3’ కూడా అదే రోజు రానుంది. ఇప్పటికే విడుదలైన ‘డ్యూన్‌’ మొదటి రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక తెలుగులో నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న ‘కింగ్‌ 100’ కూడా డిసెంబరు 24న వస్తుండటం గమనార్హం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. ఇంటర్నెట్‌ డెస్క్: ముంబయిలోని ముకేశ్ అంబానీ నివాసం ఆంటిలియాలో గణేశ్ చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే ఈ వేడుకలకు ఈసారి కూడా సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. తారల రాకతో అంబానీ నివాస ప్రాంగణంలో పండుగ వాతావరణం మరింత కోలాహలంగా మారింది. ఆ ఫొటోలు మీకోసం మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వరుస సినిమాలతో ఆకట్టుకుంటోన్న జీవీ ప్రకాశ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఇమ్మోర్టల్‌’.





