
ఎలాంటి అంచనాల్లేకుండా ఓ చిన్న సినిమాగా విడుదలై.. సంచలన విజయాన్ని అందుకుంది ‘హనుమాన్‌ అంశ్‌’. (Hanuman Ansh Movie) బాక్సాఫీస్‌ వద్ద రూ.250+కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. ఇప్పుడీ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబరు 18న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇందులో శోభిత్‌ శ్రీవాత్సవ ప్రధాన పాత్ర పోషించారు. చందన్‌ ఆనంద్, పూర్ణిమ తివారి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాగ్‌మయూర్‌, మెరిన్‌ ఫిలిప్‌ జంటగా నటిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘అనుమాన పక్షి’. (Anumana Pakshi) విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 18న (anumana pakshi release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతి విషయానికి అనుమానపడే వ్యక్తి వల్ల అతనితో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్న ఆసక్తికర అంశంతో ఈ మూవీని తీర్చిదిద్దారు. నిహాల్‌ కోదాటి, సూర్య శ్రీనివాస్‌ హీరోలుగా అక్కి విశ్వనాథ్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘సీక్రెట్‌ సోల్జర్‌’. (secret soldier telugu movie) మూన్‌ లైట్‌ డ్రీమ్స్‌ సంస్థ నిర్మించింది. కమల్‌ కామరాజు, రఘుబాబు, మహేశ్, శాన్వీ మేఘన తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబరు 18న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ చూస్తే, దీన్నొక సరికొత్త స్పై కథాంశంతో తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సమర్పణలో కీర్తన్‌ గౌడ తెరకెక్కించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘418’. సూర్య రాజ్, చరణ్‌ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు. #418 మూవీ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్నొక విభిన్నమైన సీరియస్‌ ఇంటెన్స్‌ హారర్‌ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్, కరీనా కపూర్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘దాయరా’. మేఘనా గుల్జార్‌ దర్శకుడు. సెప్టెంబరు 18న (daayra 2026 release date) థియేటర్లలో విడుదల కానుంది. ఇద్దరు అధికారులు రెండు వేర్వేరు దర్యాప్తులతో ఒకే విధమైన సత్యాన్ని అన్వేషించడమే ఈ చిత్ర కథాంశమని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే కథతో అభిరామ్‌ తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. (happy journey movie 2026) అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్‌ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 18న థియేటర్లలోకి రానుంది. ‘వినోదం, భావోద్వేగాల మేళవింపుగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.