
ఆదిలాబాద్ సాంస్కృతికం: క్రైస్తవులకు ఎస్సీ హోదాను కొనసాగించాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు బోడపాటి జయంత్ కుమార్ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రం సంజయ్ నగర్‌ కాలనీలోని చర్చిలో ఏర్పాటు చేసిన దళిత క్రైస్తవుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేషనల్ క్రిస్టియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బిషప్ సంజయ్ ఆనంద్ ఆదేశాల మేరకు జిల్లాలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు వివరించారు. దళిత క్రైస్తవులు నిరాశ, నిస్పృహకు లోను కావొద్దని, అందరు ధైర్యంగా, ఐక్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అమృత్ రావు, వికలాంగుల కార్యదర్శి జక్రయ్య, మహిళా నాయకురాలు అలం రూప తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





