
Updated on: Sep 13, 2026 | 5:21 PM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ భవిష్యత్తులో మానవాళికి పెనుప్రమాదంగా మారుతుందన్న హెచ్చరికలు టెక్ ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్‌కు చెందిన పరిశోధకుడు ఇవాన్ హుబింగర్ చేసిన తాజా ప్రకటన ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. రాబోయే పదేళ్లలో ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పది శాతానికి పైగా జనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు మన దగ్గర ఎలాంటి స్పష్టమైన ప్రణాళికలు లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఏఐ ముప్పు కొంత తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, రాబోయే రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చు. ఒకవేళ ఏఐ తనను తాను స్వయంగా మెరుగుపరుచుకునే స్థాయికి అంటే సూపర్ ఇంటెలిజెన్స్ స్థాయికి చేరుకుంటే, దానిని అదుపు చేయడం మానవుల వల్ల కాకపోవచ్చు. ఏఐ అభివృద్ధి శరవేగంగా సాగుతున్నా, దానికి తగినట్లుగా భద్రతా చర్యలు మాత్రం వేగంగా లేవు. టెక్ దిగ్గజాలైన మెటా, ఆంథ్రోపిక్, ఓపెన్ఏఐ, గూగుల్ వంటి సంస్థల మధ్య నంబర్ వన్ స్థానం కోసం జరుగుతున్న పోటీలో సేఫ్టీని పూర్తిగా పక్కన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఐక్యరాజ్యసమితి హక్కుల చీఫ్.. వోల్కర్ టర్క్ కూడా అడ్వాన్స్డ్ ఏఐ వల్ల ముప్పు ఉందని గట్టిగా హెచ్చరించారు. ఇప్పుడు ఇవాన్ హుబింగర్ కూడా అదే స్థాయిలో వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే భవిష్యత్తు ఎంత ప్రమాదకరంగా మారుతుందో అర్థమవుతోంది. ఏఐ వ్యవస్థలు మానవుల నియంత్రణలో ఉంటేనే సురక్షితమని, లేదంటే టెక్నాలజీనే మానవ జాతిని నియంత్రించే రోజులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే కఠినమైన నియంత్రణ చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో పెను మూల్యం చెల్లించుకోక తప్పదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2027లో ఏం జరగబోతోంది? బాబా వంగ జోస్యం తెలిస్తే వణికిపోవాల్సిందేనా?
ఒక్క నది లేదు.. చుక్క వర్షం పడదు.. అయినా నిత్యం 3.7 కోట్ల మందికి మంచినీరు.. ఎలా?
వైష్ణవితో నిజంగానే లవ్ ఉందా ? అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ
