
హైదరాబాద్ : మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) ఖైరతాబాద్ లోని పంచముఖ సంకటహర మహాగణపతి ( Khairatabad Ganapathi ) ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ దానం నాగేందర్ ఆధ్వర్యంలో తలసానిని సన్మానించి గణపతి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రపంచంలో నే అతిపెద్ద వినాయకుడిగా ఖైరతాబాద్ గణపతి కి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 69 సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. 11 రోజుల పాటు పూజలు అందుకునే అతిపెద్ద ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వచ్చి దర్శనం చేసుకుంటారని చెప్పారు. ప్రజలందరిపై ఆ గణనాధుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలి ఆకాంక్షించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీ కి శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద భారీకెడ్లు , సీసీ కెమెరాలు, నిమజ్జనం క్రేన్ తదితర ఏర్పాట్లను గతంలో ఉత్సవ కమిటీ వారు చేసుకునే వారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మంత్రిగా తాను చొరవ తీసుకుని అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం ఆధ్వర్యంలో చేయడం జరిగిందని వివరించారు. ఆయన వెంట ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, నాయకులు బాక్సర్ అశోక్, గజ్జెల నగేష్, మహేష్ యాదవ్, రాంరెడ్డి, ఆనంద్, మహేందర్ తదితరులు ఉన్నారు.




