
బీబీనగర్, సెప్టెంబర్ 13 : తెలంగాణ రాష్ర్ట సాధకుడు కేసీఆర్ ఇంటి ముందు కాంగ్రెస్ నాయకులు చావు డప్పు కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బీసీ జనసభ రాష్ర్ట వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్కు ఎలాంటి ఆపద కలగకూడదని, ఆయన ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మల్లన్న స్వామి సన్నిధిలో 21 పట్నాలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పట్ల కాంగ్రెస్ నాయకులు కనీస గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా కేసీఆర్ను ఎదుర్కోలేకనే వ్యక్తిగత విమర్శలు, అవమానకర చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ర్ట అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణ ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రాష్ట్రానికి అండగా నిలవాలని కోరుకుంటూ మల్లన్న స్వామిని ప్రార్థించామన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరి యాదవ్, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ చేవెళ్ల సంపత్ కుమార్ కురుమ, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు గుండెబోయిన అయోధ్య యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి సోము రమేష్ కురుమ, యాదవ విద్యావంతుల వేదిక రాష్ర్ట కోశాధికారి కొత్తపల్లి ఆనంద్ యాదవ్, శ్రీకృష్ణ యాదవ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పుట్ట వీరేష్యాదవ్, కడెం బీరప్ప, దొంతరపల్లి పోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.





