
చియాన్ విక్రమ్ కొత్త సినిమాకు టైటిల్ ఖరారైంది. ఇప్పటివరకు ‘చియాన్ 63’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు ‘పవర్ హౌస్’ అనే పేరును మేకర్స్ ప్రకటించారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2027లో థియేటర్లలో విడుదల కానుంది. టైటిల్ అనౌన్స్మెంట్ ప్రోమోలో “CHIYAAN in the HOUSE, for POWER HOUSE” అనే లైన్‌తో సినిమాకు పేరు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రోమోలో సత్య జ్యోతి ఫిల్మ్స్, ఆనంద్ శంకర్, సంతోష్ నారాయణన్, రియా షిబు పేర్లు కూడా కనిపించాయి. 2026 ఏప్రిల్ 17న విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ ఫ్లేమ్ ప్రోమోను విడుదల చేశారు. అందులో విక్రమ్ వంటవాడి పాత్రలో కనిపించారు. “లోపల ఉన్నవాడు ఎవరు?” అనే ప్రశ్నకు “కేవలం వంటవాడే. కానీ తేలికగా తీసుకోవద్దు. ప్రమాదకరమైనవాడు” అనే డైలాగ్ ఆసక్తి పెంచింది. ప్రోమోలో గదిలోకి పేలుడు పదార్థాలు విసిరినా, విక్రమ్ పెద్ద పాత్రపై కూర్చుని బీడీ వెలిగించుకుంటూ కనిపించిన సీన్ హైలైట్‌గా నిలిచింది. అదే ప్రాజెక్ట్‌కు ఇప్పుడు ‘పవర్ హౌస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా విక్రమ్, ఆనంద్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం. గతంలో వీరిద్దరూ ‘ఇరు ముగన్’ (2016) కోసం కలిసి పనిచేశారు. అయితే ‘పవర్ హౌస్’ ఆ సినిమాకు సీక్వెల్ కాదని పేర్కొన్నారు. ‘పవర్ హౌస్’ అనే టైటిల్, ఫస్ట్ ఫ్లేమ్ ప్రోమోలో చూపించిన వాతావరణం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. వంటవాడి పాత్రలో కనిపించిన విక్రమ్ వెనుక మరో కోణం ఉందనే సూచనలు ప్రోమోలో కనిపించాయి. 2027లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లీడ్ హీరోయిన్, ఇతర ప్రధాన నటీనటుల వివరాలను చిత్రబృందం ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం స్పష్టమైన విషయం ఏమిటంటే.. ‘చియాన్ 63’ ఇకపై ‘పవర్ హౌస్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.




