
క్యాబ్ బుక్ చేసుకునే ముందే డ్రైవర్‌కు టిప్ చెల్లించే విధానాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం అగ్రిగేటర్లను ఆదేశించింది. ఈ విధానం వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తోందని.. ఇదో అన్యాయ వ్యాపార పద్ధతి అని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. రైడ్ పూర్తయిన తర్వాత టిప్ ఇవ్వడం వినియోగదారుడి ఇష్టంపై ఆధారపడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ముందుగా టిప్ ఇవ్వకపోతే రైడ్‌ను యాక్సెప్ట్ చేయరు అనే భావన ప్రయాణికులకు కలిగించొద్దని చెప్పారు. 👉మరిన్ని వివరాలు




