
అసలేం జరిగిందంటే.. ఇరాన్‌లోని సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం మషద్ నుంచి కెర్మాన్‌షాకు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం టైరు ఊడిపోయింది. అదే సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. టేక్యాఫ్ సమయంలో టైరు పేలడం వల్ల శకలాలు ఇంజిన్లోకి వెళ్లి దానిని దెబ్బతీసి ఉండవచ్చని స్థానిక మీడియా తెలిపింది. ఒకే ఇంజిన్‌తో ప్రయాణం కొనసాగించడం ప్రమాదమని భావించిన పైలట్లు, వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి మషద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. మషద్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేపై విమానం తీవ్రమైన కుదుపులకు లోనైంది. ఈ ధాటికి లగేజీ క్యాబిన్లు తెరుచుకుని బ్యాగులన్నీ ప్రయాణికులపై పడటంతో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయభ్రాంతులకు గురయ్యారు.




