
చర్మం ఆయిలీగా ఉందని మాయిశ్చరైజర్ అసలు అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కానీ చర్మంలో తేమ తగ్గినప్పుడు మరింత ఆయిల్ ఉత్పత్తి కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆయిలీ స్కిన్‌కు తేలికపాటి జెల్ ఆధారిత మాయిశ్చరైజర్ ఉపయోగించవచ్చని NIH అధ్యయనం పేర్కొంది. హైలూరోనిక్ యాసిడ్, నియాసినామైడ్ ఉన్న ఉత్పత్తులు చర్మానికి తేమను అందించడంతో పాటు ఆయిల్‌ను బ్యాలెన్స్ చేయడంలో, ఎర్రదనాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. డ్రై స్కిన్ ఉన్నవారికి చర్మం బిగుతుగా అనిపించడం, పొడిబారడం వంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి వారికి చర్మ రక్షణ పొరను బలపరచడంలో సహాయపడే సెరమైడ్స్ ఉన్న మాయిశ్చరైజర్ ఉపయోగపడుతుంది. గ్లిజరిన్, హైలూరోనిక్ యాసిడ్ చర్మంలో తేమను నిలుపుతాయి. స్క్వాలేన్, షియా బటర్ ఉన్న క్రీమ్‌లు కూడా తేమను చర్మంలో నిలుపుకోవడానికి ఉపయోగపడవచ్చు. డ్రై స్కిన్‌కు జెల్ కంటే క్రీమ్ బాగా సరిపోవచ్చు. కాంబినేషన్ స్కిన్‌లో ముఖం మధ్య భాగం అంటే టీ-జోన్ ఆయిలీగా ఉండొచ్చు. అదే సమయంలో బుగ్గలు పొడిగా లేదా బిగుతుగా అనిపించవచ్చు. ఇలాంటి చర్మానికి గ్లిజరిన్, నియాసినామైడ్, కొంత సెరమైడ్స్ ఉన్న మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవచ్చు. అవసరాన్ని బట్టి టీ-జోన్‌కు తేలికపాటి జెల్, బుగ్గలకు క్రీమ్ ఉపయోగించడం కూడా ఒక మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఆయిలీ, మొటిమలు వచ్చే చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ వల్ల రంధ్రాలు మూసుకుపోతాయని భయపడుతుంటారు. ఇలాంటి వారు నాన్-కామెడోజెనిక్ అని లేబుల్‌పై ఉన్న మాయిశ్చరైజర్లను ఎంచుకోవచ్చని SS అధ్యయనం పేర్కొంది. ఇవి చర్మ రంధ్రాలు బ్లాక్ కాకుండా రూపొందించిన ఉత్పత్తులు. ముఖానికి చాలా హెవీగా అనిపించే ఉత్పత్తులను ఎంచుకోకుండా, మీ చర్మానికి సరిపోయే తేలికపాటి ఫార్ములాను ఎంచుకోవడం మంచిది. ముఖం శుభ్రం చేసుకున్న వెంటనే చర్మం పూర్తిగా ఆరిపోయే వరకు వేచి ఉండకుండా, రెండు మూడు నిమిషాల్లో చర్మం కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాస్తే తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. సీరమ్, ఇతర స్కిన్ ట్రీట్మెంట్ ఉపయోగిస్తే ముందుగా వాటిని రాసి, తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి. ఉదయం చివరగా సన్‌స్క్రీన్ రాయాలి. అలాగే వయసు, హార్మోన్లు, సీజన్ మార్పులతో చర్మం స్వభావం మారవచ్చు కాబట్టి మాయిశ్చరైజర్ కూడా అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ముఖ్య . కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.