
క్యాబ్ సేవలు అందించే ఓలా, ఊబర్, ర్యాపిడో ప్లాట్‌ఫామ్‌లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. బుకింగ్‌కు ముందే వినియోగదారుల నుంచి టిప్ తీసుకునే అడ్వాన్స్ ఫీచర్ విధానాన్ని వెంటనే ఆపేయాలని హెచ్చరించింది. ఈ మేరకు క్యాబ్, బైక్-ట్యాక్సీ అగ్రిగేటర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఇలా యాప్ ఓపెన్ చేయకముందు ఒక రేటు, తర్వాత మరో రేటు చూపించడం వినియోగదారులను తప్పుదోవ పట్టించడమే అవుతుందని, ఇది నైతిక వ్యాపార సూత్రాలకు విరుద్ధమని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే బుధవారం స్పష్టం చేశారు.




