
© 2026 nimisham.in

ఎక్కువ ఆలయాలు నిర్మించి ఆధ్యాత్మికతను పెంచడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమలలో రెండోరోజు పర్యటనలో భాగంగా సీఎం మాట్లాడుతూ.. ఆలయాలను పరిరక్షించి భావితరాలకు అందజేయాలన్నారు. 1999లో తాను ప్రారంభించిన మ్యూజియంను ఆధునికీకరించామని వివరించారు. వెంకటేశ్వరస్వామి పవిత్రత, చరిత్ర అందరికీ అర్థమయ్యేలా మ్యూజియం ఏర్పాటుచేశామన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు అండగా నిలిచిన ట్రస్టుకు అభినందనలు తెలిపారు. రాబోయే ఐదేళ్లూ నిర్వహణ బాధ్యత ట్రస్టుకే అప్పగిస్తున్నామన్నారు. తిరుమలకు వచ్చే భక్తుడు ఇబ్బందిపడకుండా చూడాలన్నారు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.








