
హాజరైన హైకోర్టు న్యాయమూర్తులు అనంతపురం (ఎస్కేయూ), న్యూస్‌టుడే: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ)లో 1988-91 మధ్య ఎల్‌ఎల్‌బీ (న్యాయవిద్య) పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అనంతపురంలో జరిగింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి, జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, రిజిస్ట్రార్‌ మహమ్మద్‌ ఫజులుల్లా, అనంతపురం జిల్లా న్యాయమూర్తి వెంకటేశ్వర్లు, హైకోర్టు న్యాయవాదులు రతంగ ఫణిరెడ్డి, అనిల్‌కుమార్, జిల్లా న్యాయవాదులు, ఇతర వృత్తుల్లో స్థిరపడినవారు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమ జీవితాల్లో సాధించిన విజయాలను వేదికపై పంచుకున్నారు. ఆకాశవాణి మాజీ డైరెక్టర్‌ నాగేశ్వరరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




