
నూతన బస్సులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే సత్యప్రభ, ఈవో చక్రధరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం సత్యదేవుని భక్తులకు రవాణా సౌకర్యాలు మెరుగుపర్చేందుకు కొనుగోలు చేసిన రెండు బస్సులను ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదివారం ప్రారంభించారు. ఒక్కొక్కటి రూ.48 లక్షల వ్యయంతో కొనుగోలు చేయగా వీటిని ప్రారంభించిన ఆమె ఈవో చక్రధరరావు, ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఇప్పటికే 9 బస్సులు ఉండగా మరో రెండు రాకతో రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.